రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి.ఏదుల మాకొద్దు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి వినతిపత్రం

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 17 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలో 22 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో రాజాపూర్ గ్రామం జనాభా పరంగా విస్తీర్ణం లో పెద్దదిగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 లో చేపట్టిన నూతన మండలాల ప్రక్రియలో భాగంగా  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నప్పుడు రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. నిరసనలు రాస్తారోకోలు అర్థనగ్నం తో నిరసనలు వంటావార్పులు ఇలా ఎన్నో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లాకలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అయినా  ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు ప్రస్తుతం ఇప్పుడు నూతన మండలాల ప్రస్తావన వచ్చినప్పటికీ కొన్ని గ్రామపంచాయతీలను మండల కేంద్రాలుగా  ప్రకటించారు. ఈ తరుణంలో కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని నాగర్ కర్నూల్ జిల్లాలోని కొనసాగాలని. ఎట్టి పరిస్థితుల్లో వనపర్తి జిల్లాలో కలపకూడదని రాజాపూర్ గ్రామ యువకులు మరియు సింగాయిపల్లి యువకులు మాచుపల్లి రేకులపల్లి గ్రామాల యువకులు మా గ్రామాలను ఏదులలో కలపవద్దని చేస్తే రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని లేనియెడల కోడేరు మండలంలోనే కొనసాగుతామని వివిధ శాఖల అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వాటిలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు మాచుపల్లి గ్రామ యువకులు రాజాపూర్ గ్రామ యువకులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆగస్టు 16 మంగళవారం రోజు రేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఒప్పి తాండకు వచ్చిన సందర్భంగా   కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి కి  రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యువకులు ఎమ్మెల్యేకు  వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆర్ కృష్ణ, పి కురుమూర్తి,సిరాజుద్దీన్, పి శివ, మబ్బు రాముడు, చాకలి రాముడు, తెలుగు పెద్ద వెంకటస్వామి, చికిరాల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.