రాజీవ్ గాంధీ స్టేడియం అభివృద్ధి పనులకు 4.5 కోట్ల నిధులకు ప్రతిపాదనలు

బ్యాడ్మింటన్ పోటీలను సందర్శించిన డి.ఎస్.డి.ఓ మక్బూల్ అహ్మద్
మిర్యాలగూడ, జనం సాక్షి
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ లో గల రాజీవ్ గాంధీ స్టేడియం అభివృద్ధి పనులకు గాను 4.5 కోట్ల రూపాయల నిధుల కోసం  ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని నల్గొండ డి.ఎస్.డి.ఓ ఎండి మక్బూల్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం పట్నంలోని హౌసింగ్ బోర్డ్ లో గల క్లియో స్పోర్ట్స్ అరేనా స్టేడియంలో జరుగుతున్న బ్యాట్మెంటన్ జూనియర్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ పోటీలను ఆయన సందర్శించి  మ్యాచ్ లను తిలకించారు. అనంతరం విలేకరుల సమావేశంలో డి.ఎస్.డి.ఓ మక్బూల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడల శాఖ నుంచి నిధులు మంజూరు అయిన వెంటనే రాజీవ్ గాంధీ స్టేడియం అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాట్మెంటన్ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అండర్ -13 బాల, బాలికల క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈనెల 23 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జట్టు ఎంపిక జరుగుతుందన్నారు.  బ్యాట్మెంటన్ అసోసియేషన్ బాధ్యులు పర్యవేక్షణలో జరుగుతున్నాయని వారు తెలిపారు. ఈ సమావేశంలో బ్యాట్మెంటన్ కోచ్ రామకృష్ణ బాక్సింగ్ కోచ్ రవీందర్ తదితరున్నారు.
Attachments area

తాజావార్తలు