రాత్రి వేళల్లో హోటళ్లు..టీస్టాళ్లు తెరిచి ఉండేందుకు అనుమతి ఇవ్వండి
మీలాదున్నబి సందర్భంగా సి.పికి ఎంఐఎం నేతల వినతి
కరీంనగర్, సెప్టెంబర్ 27:-
రేపటినుండి నెలవంక దర్శనంతో రబివుల్ అవ్వల్ నెల మొదలవుతుండటంతో..ఈద్ మీలాదున్నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో 12 రోజులపాటు హోటళ్లు, టీస్టాళ్లు తెరిచి ఉండేలా అనుమతి ఇవ్వాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు.. కార్పొరేటర్లు జిల్లా పోలీసు కమిషనర్ సత్యనారాయణ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ మాట్లాడుతూ ఈద్ మీలాదున్నబి నేపథ్యంలో నగరంలో 12 రోజుల పాటు ఆధ్యాత్మిక సదస్సులు (జల్సాలు) ఉంటాయని, ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడతారన్నారు. ఈనెల 28 నుండి అక్టోబర్ 8వరకు ఆధ్యాత్మిక సదస్సులు కొనసాగుతాయని.. ఉపవాస దీక్షలు పాటించే వారికి వీలుగా ఉండేందుకు నగరంలో రాత్రి వేళలో టీ స్టాళ్లు.. హోటళ్లు ఉదయం సహేరీ 4గంటల వరకు తెరిచి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసు కమిషనర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, సహాయ కార్యదర్శి సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, కార్పొరేటర్లు అఖీల్ ఫిరోజ్, ఆతిన, అలిబాబా, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area