రామప్పలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు…
వెంకటాపూర్(రామప్ప) అక్టోబర్ 01(జనం సాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయ ఆవరణలో ఐసిడిఎస్ ములుగు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ఆధ్వర్యంలో శనివారం ఐసిడిఎస్ ములుగు ప్రాజెక్టు పరిధిలోని అంగన్ వాడీ టీచర్లు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు తీరొక్క పూలతో ఐసిడిఎస్ అనే పేరుతో భారీ బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆట ఆడుతూ పాటలు పాడారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ డిడబ్ల్యుఓ ప్రేమలత మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని,తీరొక్క పూలతో మహిళలు ఎంతోఇష్టంగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.కుల మతాలకు అతీతంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి,సరస్వతి,అరుణ,పాలం పేట సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్,అంగన్ వాడీ టీచర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షురాలు ఎనగందుల సునీత,అంగన్ వాడీ టీచర్లు భాగ్యమ్మ,మంజుల, లక్ష్మీకాంత,కమల,రుక్మిణీ,జయరా ణి, వసంత,కమల,రజిత,సంద్య,లక్ష్మీ, పద్మ,
వరలక్ష్మి,పూలమ్మ,మాధవి,రజిత తదితరులు పాల్గొన్నారు.