రామప్పలో నాలుగో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్
వెంకటాపూర్(రామప్ప) సెప్టెంబర్23 (జనం సాక్షి):-
రామప్పలో నాలుగో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్
వాలెంటైర్స్ మొదటగా యోగ గురువు రాంబాబు ఆధ్వర్యంలో రామప్ప చెరువు కట్ట పైన రెండు గంటల పాటు యోగాసనాలు నేర్చుకున్నారు. ప్రోపేసర్ చూడమని నందగోపాల్,రామప్ప దేవాలయం లోని నృత్య శిల్పాలు,సాంప్రదాయ నృత్యం పైన, ప్రోపేసర్ పాండు రంగా రావు అసిస్టెంట్ టూరిజం ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్ లు పర్యాటక ప్రదేశాలు వాటి ప్రత్యేకతలు పైన వివరించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యులు శ్రీధర్,టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.