రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

1

భద్రాచలం: భద్రాచలం సీతారాముల కల్యాణోత్సం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్‌, బాల్కాసుమన్‌, కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌, ఐజీ నవీన్‌ చంద్‌ తదితరులు రాములోరి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.