రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రామరాజ్యం…

బిజెపి ములుగు అసెంబ్లీ కన్వీనర్ బలరాం….
రామప్పలో ప్రత్యేక పూజలు….
వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్23(జనం సాక్షి):-
రామప్ప రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నాయకత్వంలో రామరాజ్యం వస్తుందని బిజెపి ములుగు అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం అన్నారు.శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రామప్పకు వచ్చిన బలరాంను బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్ ఆధ్వర్యంలో నాయకులు సాధారణంగా ఆహ్వానించగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బలరాం ను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా  బలరాం,జవహర్ లాల్ మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ నియంత పాలన నుంచి విముక్తి పొందాల్సిన సమయం వచ్చిందన్నారు.కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన  టిఆర్ఎస్ పాలకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. గ్రామపంచాయతీలకు వంద శాతం నిధులు ఇస్తున్నది కేంద్రంలోని బిజెపి  పార్టీయేనని గుర్తు చేశారు. తెలుగులో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా బూత్ కమిటీలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాపయ్యపల్లి గ్రామానికి వెళ్లి బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ధరమ్ సోత్ ప్రేమ్ సింగ్, కార్యవర్గ సభ్యులుగా బోడ నరేష్,కాసర్ల సురేష్, ఎలకంటి రాజు,పల్లెర్ల సతీష్, రాజేందర్,ప్రవీణ్,నవీన్ ,విజయ్,రాకేష్, శ్రీను, రమేష్,వెంకటేష్,గోపాల్,రమేష్ చారీ,రవి ,తిరుపతి,మల్లేష్,చొక్కా రావు,రమేష్ మొగిలి,రాజు,భాస్కర్,ఓదెలు కృష్ణ,రమేష్ లను ఎన్నుకున్నారు.కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాజు నాయక్, అల్లే శోభన్,వైద్యుల తిరుపతిరెడ్డి,కారు పోతుల యాదగిరి గౌడ్,సురేందర్,మండల యువమోర్చా అధ్యక్షుడు గంగుల రాజ్ కుమార్,సంతోష్ ,సిద్దు, తిరుపతి,నాగరాజ్ ,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.