*రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని బాధలు తీరుతాయి*.

*పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ సంపత్ కుమార్* అలంపూర్ ఆగస్ట్  ( జనం సాక్షి )  తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాబందుల పాలన సాగుతుందని ఈ రాక్షసపాలనను అంతమొందించాలని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ సంపత్ కుమార్ అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలు కష్టాలను తెలుసుకొనుటకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అలంపూర్ పట్టణం నుండి పాదయాత్రను ప్రారంభించారు. అంతకుముందు  మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జోగులాంబ  అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు  తీసుకున్నారు. అనంతరం మజీద్ కి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం  పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్. ఏ సంపత్ కుమార్  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచుకుంటూ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతూ అవినీత పాలన చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
రాబోయే ఎన్నికల్లో అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో  కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మన సాధక బాధలు తీరుతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకేంద్ర రాష్ట్రాల్లో ప్రతి కార్యకర్త కృషి చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గ సమన్వయకర్త లక్ష్మీనారాయణ రెడ్డి, అలంపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు  జోగుల రవి, మానవపాడు ఎంపీపీ అశోక్ రెడ్డి, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు