రాష్ట్రంలో టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
నర్సాపూర్, అక్టోబర్, 9, ( జనం సాక్షి )
త్వరలో టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని బిజెపి చేరికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
రాష్ట్రంలో పది వేల కోట్ల ఆదాయం ఉన్న ఎక్సైజ్ శాఖ 45 వేల కోట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏక్సిజ్ శాఖ మాత్రమే అభివృద్ధి చెందిదాని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది మద్యం కు బానిస కావడంతో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కెసిఆర్ అహంకారాన్ని బొంద పెట్టి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ఆరోపించారు.
మునుగోడు లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.
ముఖ్యమంత్రి దీరుడు లెక్క కొట్లాడలే తప్ప వక్రమార్గంలో పోవద్దని సూచించారు
.