రాష్ట్రంలో పెట్రోలియం కొరతలేదు

` సరిపడా నిల్వలున్నాయి
` ఇంధన సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవు
` అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందొద్దు
` ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
` ట్యాంకర్లు సకాలంలో రాకపోవడంతోనే నో స్టాక్ బోర్డులు
` పెట్రో కొరతపై పుకార్లు నమ్మొద్దు
` రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమద్ధిగా ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నేడు శాసనమండలి సమావేశపు హాలులో రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ కిషన్ రావు లతో కలిసి గ్యాస్, పెట్రోల్ సరఫరాలను సవిÖక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు, పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అపోహలు కలిగించే మాధ్యమాల కధనాలతో ఆందోళన చెందవద్దని వినియోగదారులకు సూచించారు. రెగ్యులర్ గా కొనుగోలు చేసే దాని కంటే, ఎక్కువగా కొని నిల్వ చేయవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదాదారునికి కూడా పెట్రోల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని అధికారులు, ఏజెన్సీ లను ఆదేశించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుటకు రెగ్యులర్ గా ప్రెస్ బ్రీఫింగ్స్ ఇవ్వాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీ లకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
ట్యాంకర్లు సకాలంలో రాకపోవడంతోనే నో స్టాక్ బోర్డులు:మంత్రి ఉత్తమ్
పెట్రోల్, డీజిల్ లభ్యత విషయంలో ప్రజలు అపోహలను నమ్మొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (ఙబిబిజీఎ kబీఎజీతీ తీవటటy) అన్నారు. ఆయిల్ కంపెనీలు కూడా సరిపడా నిల్వలు ఉన్నట్లు చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో ఆయన విÖడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. వదంతుల కారణంగా పెట్రోల్, డీజిల్ ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే బంకుల్లో రద్దీ నెలకొందని తెలిపారు. క్యాన్లు, కంటెయినర్లలో ఇంధనాన్ని తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని చెప్పారు. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.“ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం వల్లే బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. గహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు. వసతి గహాలు, ఆసుపత్రులకు గ్యాస్ కొరత లేకుండా మానిటరింగ్ చేస్తున్నాం. హైదరాబాద్‌లో 596 పెట్రోల్ బంకులు పూర్తిగా పనిచేస్తున్నాయి. ఏ బంకునూ మూసివేయడానికి అనుమతించం. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రంతో మాట్లాడుతున్నాం. చట్టవిరుద్ధంగా నింపిన 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు” అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
వదంతులను నమ్మొద్దు: సజ్జనార్
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ విÖడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని నగర కలెక్టర్ హరిచందన, సీపీ సజ్జనార్ తెలిపారు. కత్రిమ కొరత సష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ విÖడియా వార్తలపై నిఘా పెట్టామన్నారు. (Tవశ్రీజీనిణజీనిజీ ఔవలిబ)
రాష్ట్రంలో ఎట్రోల్ కొరత లేదు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ విÖడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయంటూ.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. పెట్రోలు, డీజిల్ కొరత రాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్ప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. కత్రిమ కొరత సష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వాహనదారులు రోజువారీ అవసరాల మేరకు.. పెట్రోలు, డీజిల్‌ను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వస్తున్న పుకార్లపై ఆయన స్పందిస్తూ.. ’అమెరికా, ఇజ్రాయిల్ ? ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ సోషల్ విÖడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ఇండియన్ ఆయిల్, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ వంటి అన్ని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీల వద్ద అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉంది. పెట్రోలు, డీజిల్ సరఫరాలోనూ లోపం లేదు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పెట్రోలు, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్ కూడా స్పష్టం చేసింది. సోషల్ విÖడియాలో జరుగుతున్న దుష్పచ్రారాన్ని నమ్మి చాలా మంది పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీస్తూ అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కొన్ని పెట్రోలు బంకుల్లో తాత్కాలికంగా కొరత ఏర్పడుతోంది. ఇదే అదనుగా కొంతమంది కత్రిమ కొరత సష్టించి బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజÊఝప్తి చేస్తున్నా’ అని అన్నారు.