రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడు మండిపోతున్నాడు. ఆదివారం రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయింది. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా నంద్యాల, కర్నూలులో 44,నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.