రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పోరుబాట
` అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలం
` సరైన సమయంలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు
` బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్(జనంసాక్షి):కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమవుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు విమర్శించారు. సర్కార్ వైఫల్యాలను మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఆయన ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు వెళ్తుందని అనుకోవడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ’బీసీ కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్పింది. సెప్టెంబర్ రెండో వారం నుంచి హావిూ అమలుచేయాలని నిరసనలు తెలుపుతాం. సంపూర్ణ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మేం అడగకపోతే ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదు. రైతులు తిరగబడతారనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ఇవాళ జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. భట్టి చెప్పినట్లు రైతుల ఖాతాల్లో కేవలం రూ.7 వేల 500 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. బీఆర్‌ఎస్ సర్కార్ దిగిపోయే సమయానికి రెవెన్యూ మిగులు రూ.5 వేల 300 కోట్లు ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ మిగులుపై ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడి విషయాన్ని పక్కదోవ పట్టించారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అదానీ సంస్థలను కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదని కేటీఆర్ అన్నారు. ’అదానీ విషయంలో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి తేడాలు ఉన్నాయి. ఆయనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అదానీ కంపెనీతో పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట అదానీ కంపెనీకి అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ తల్లి అంటే అందరికి రోల్ మోడల్. సెక్రటేరియట్ ముందు రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యమైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఎలా పెడతారు. తెలంగాణ చరిత్రలోంచి కేసీఆర్‌ని ఎవరూ చెరిపేయలేరు. ముఖ్యమంత్రిగా రేవంత్ సాధించిన రికార్డ్ ఏదైనా ఉందా అంటే అది ఢల్లీికి వెళ్లడమే. సీఎంగా ఇప్పటివరకు ఆయన 20 సార్లు దేశరాజధానికి వెళ్లారు. ఇదొక్కటే రేవంత్ సాధించిన ఘనత’ అని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రం సిద్ధించినా.. కాంగ్రెస్ పాలనలో పరాయి పాలకుల ఛాయలు కనిపిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. ’అసెంబ్లీ విూడియా సలహాదారు ప్రసన్న కుమార్, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి, తెలంగాణ ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు.. వీళ్లందరు ఏ రాష్టాన్రికి చెందిన వారు? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక్క రాజ్యసభ సభ్యుడు దొరకలేదా? అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ గురించి మాట్లాడితే ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తారు? మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ మాదిగలకు ఇవ్వలేదు’ అని కేటీరామారావు విమర్శించారు.
రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్ పోరు బాట
రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్ పోరు బాటపట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కదంతొక్కారు. అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హావిూని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసారు. చేవెళ్లలో సబితతో కలసి కెటిఆర్ ధర్నాకు దిగారు. జిల్లాల్లో నేతలు ధర్నాల్లో పాల్గొన్నారు. రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సవాల్ విసిరారు. రేవంత్‌కు దమ్ముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని పిలిచారు. రుణమాఫీ జరిగిందో.. లేదో గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రూ. 2 లక్షలు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ భారీ ధర్నా చేపట్టింది. చేవెళ్లలో నిర్వహించిన ఈ ధర్నాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ’రైతు రుణమాఫీ చెయ్యకపోతే నీ లాగుల్లో తొండలు వదిలి రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టం’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి కూడా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వెండపడుతామన్నారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ నినదించారు. మూడు రోజుల క్రితం నర్కోడా గ్రామానికి వెళ్లానని.. గ్రామాల్లో ఇప్పుడు కళ తప్పిందని అక్కడి ప్రజలు అన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. డిసెంబర్ 9 నాడు అధికారంలోకి రాగానే రైతు రుణమాఫి చేస్తానని సోనియా గాంధీ విూదా ఒట్టు వేసి చెప్పాడని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల రుణమాఫి కావాలంటే రూ. 49 వేల కోట్లు ఖర్చు అవుతుందని బ్యాంకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేవుల్ల విూద ఒట్టు పెట్టారని.. రైతు రుణమాఫి చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ’దేవెళ్ళు కూడా అడుగుతున్నారు.. రేవంత్ రెడ్డి ఎక్కడకి పోయాడని.. మమ్మల్ని మోసం చేశాడని.’ అని తనదైన శైలిలో సీఎంపై విరుచుకుపడ్డారు కేటీఆర్. డబ్బులు లేక రైతు రుణమాఫీ విషయంలో కొర్రీలు పెట్టారని దుయ్యబట్టారు. రూ. 31 వేల కోట్లు అవసరమని కేబినెట్‌లో పెట్టారని.. బ్జడెట్‌లో చూస్తే రూ. 26 వేల కోట్లే పెట్టారని విమర్శించారు. ఇదే అంశంపై అసెంబ్లీలో తాము ప్రశ్నిస్తే తమ మైక్‌లు కట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అసెంబ్లీలో జరిగిన అవమానంపైనా కేటీఆర్ మాట్లాడారు. ’అసెంబ్లీలో సబితక్క పాపం ఒక్క మాట అనలేదు. ఇంట్లో దోమలు కుడుతున్నాయి.. ఇంటి బయలకు పోతే కుక్కలు కరుస్తున్నాయి అని అసెంబ్లీలో సబితక్క మాట్లాడిరది. అక్కలను నమ్ముకుంటే నీ బ్రతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని సబితమ్మను టాª`గ్గంªట్ చేశారు రేవంత్. నిండు శాసనసభలో సబితక్కను అవమానించారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి తీరును తూర్పారబట్టారు. రైతు రుణమాఫీ కాలేదని రైతులందరూ ఇవాళ రేవంత్ రెడ్డి చావు డబ్బు కొడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. కొండారెడ్డిపల్లి రైతుల దగ్గరకు పోదామని తాను సవాల్ చేస్తే.. తన సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించలేదు ఎద్దేవా చేశారు. కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫి జరిగిందని రైతులు చెబితే తాను వెంటనే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. రూ. 7,500 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్లతో అంటున్నారని.. ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షల రైతు రుణమాఫి చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిగా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రైతుబంధు కోత పెట్టేందుకు కూడా రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.