రాష్ట్రంలో 234 కరవు మండలాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి దస్త్రంపై సంతకం చేశారు. రాష్ట్రంలో 234 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. ఇవి అనంతపురంలో 63, కడపలో 43, కర్నూలులో 36, ప్రకాశం 35, చిత్తూరు 28, నల్గొండ 11, నెల్లూరు 9, మహబూబ్‌నగర్‌లో 5 గుంటూరులో 4 ఉన్నాయి..