రాష్ట్రపతి ఎన్నికను ఆయుధంగా మలుచుకోవాలి
తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీ జాక్ లేఖాస్త్రాలు
మన ఆకాంక్ష కనపడకపోతే ప్రజలు క్షమించరు : కోదండరామ్
హైదరాబాద్ , జూలై 3 (జనంసాక్షి):
రాష్ట్ర్రపతి ఎన్నికలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్ర సాధన కోసం ఉపయోగించుకునేలా కార్యాచరణ ప్రణాళికకు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టి-జెఎసి ) ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్యేల్యేల పై ఒత్తిడి తెచ్చేందుకు జూలై 7న టి-జెఎసి విస్తృత సర్వసభ్య సమావేశం జరుగునుంది.తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్యెల్యేలు ప్రత్యేక రాష్ట్ర్రం కోసం ఎంతగానో తపిస్తున్నప్పటికీ ఉద్యమంలో పాల్గొనే విషయంలో వీరికి అంకితభావం లోపించిందని మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన టి-జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఈ తరుణంలో వచ్చిన రాష్ట్ర్రపతి ఎన్నికలను రాష్ట్ర్ర సాధన కోసం ఉపయోగించుకోవాలని కోరుతూ ఎంపీలు,ఎమ్యెల్యేలకు విజ్ఞప్తి లేఖలు పంపాలని టి-జెఎసి నిర్ణయించిదన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రాంతంలోని వైద్య కళాశాలలకు అదనంగా రావలసిన 150 సీట్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని కూడా విస్తృత సర్వ సభ్య సమావేశంలో భాగంగా చర్చిస్తారు. దీనిపై రాష్ట్ర్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోదండరాం పట్ట్లుబట్టారు. తెలంగాణ సాధించుకోవడానికి ఇదే సరైన తరుణమని,దీన్ని ఉపయోగించుకోవాలని కోదండరాం అన్నారు.