రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భూతల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపు 9 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదైంది. ఈ నెల 20, 21 తేదీల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వారు తెలిపారు.