రాష్ట్రస్థాయి పోటీల్లో ‘కృష్ణవేణి’ విద్యార్ధుల ప్రతిభ


గోదావరిఖని, నవంబర్‌ 18, (జనంసాక్షి) :
రాష్ట్ర స్థాయి పోటీల్లో గోదావరిఖని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్ధులు ప్రతిభ కనబరిచారు. ఈనెల 17న జరిగిన రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో సీనియర్‌ విభాగంలో కళ్లకు గంతలు కట్టుకుని అందరిని ఆకట్టుకుని ప్రధమ స్థానంలో నిలిచారు. వి.నందిని, వి.మేఘన, హర్షిత, ప్రజ్ఞ, అంజుశ్రీ, నిఖిత, శ్రావణి, సంస్కృతి ప్రతిభ కనబరుచగా, అదే విధంగా జూనియర్‌ గ్రూప్‌ విభాగంలో కూడ ప్రధమ బహుమతి కైవసం చేసుకున్నారు. జూనియర్‌ సోలో విభాగంలో విశ్వహరిజత్‌ ప్రతిభ కనరిచారు. కాగా ఈ పోటీలో ప్రేమ చారిటబుల్‌ ట్రస్టు, ఫర్‌ఫెక్ట్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ప్రతిభ కనబరిచి విద్యార్ధులను, డ్యాన్స్‌ మాస్టర్‌ కె.విద్యాసాగర్‌ను పాఠశాల డైరెక్టర్‌ మంజుశ్రీనివాస్‌రెడ్డి అభినందించారు.