రాష్ట్రస్థాయి ర్యాంకర్ కు ఘన సన్మానం

(జనంసాక్షి)జులై :11
మండలంలోని వాల్గొండ గ్రామానికి చెందిన క్యాతం ఐశ్వర్య 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఆమెకు మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం వారి స్వగృహంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
తాసిల్దార్ రవీందర్, ఎంపీడీవో రాజ శ్రీనివాస్, సర్పంచ్ దండిక మమత, ఎంపిటిసి క్యాతం సుజాత, లైన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు శివ శ్రీనివాస్, రుద్రా ప్రసాద్, మహమ్మద్ రఫీ, కనుక సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.