రాష్ట్రానికి ఐటీ వెలుగులు

` మాది గాంధీ వారసత్వం..మోడీది గాడ్సే వారసత్వం
` తెలంగాణ యావత్తూ కెసిఆర్‌ కుటుంబమే
` ` బీఆర్‌ఎస్‌ పార్టీది బరాబర్‌ వారసత్వ రాజకీయమే..
` దమ్ముంటే కోమటిరెడ్డి సూర్యాపేటలో పోటీ చేయాలి
` కరెంట్‌ తీగలు పట్టుకుంటే ఉందో లేదో తెలుస్తుంది
` సూర్యాపేట ఐటి టవర్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి  కేటీఆర్‌
` దళిత బంధుతో దళితుల జీవితాల్లో ఆర్థిక మార్పులు
` కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం..
సూర్యాపేట(జనంసాక్షి): కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని మంత్రి కెటిఆర్‌ సవాల్‌ విసిరారు. ఎవరికి డిపాజిట్‌ రాదో తెలుస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి సవాల్‌  చేస్తున్నాని అన్నారు.  ఎంతమంది వచ్చినా సరే.. బస్సులు మావే.. ఖర్చులు మావే.. ఏం టైమ్‌కు పోయినా ఓకే. కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుంది. కరెంటు ఉందో లేదో అంటూ వ్యాఖ్యలు చేశారు. వారంటీ లేని గ్యారంటీలు కాంగ్రెస్‌ పార్టీవి. ఆరు దశబ్దాలు పాలించినా ఏవిూ చేయకుండా మళ్లీ ఆరు గ్యారంటీలా అంటూ మండిపడ్డారు.  సూర్యాపేటలో ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన సందర్భంలో కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు.మాట్లాడారు.  ఓటుకు నోటు కేసులో దొరికి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు. ప్రధాని మోడీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే. అద్భుతాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీది వారసత్వ రాజకీయమే. మాది మహాత్మాగాంధీ వారసత్వం.. మోడీదీ గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. మంత్రి జగదీష్‌ రెడ్డి చేసిన సేవ, అభివద్ధికి 50 వేల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్‌ కోరారు. తొమ్మిదేళ్లలో సూర్యాపేటలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని మంత్రి కెటిఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఏనాడూ కరెంట్‌ సక్కగా ఇవ్వలేదని విమర్శించారు. ఐటీ హబ్‌లో మహాత్మ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కెటిఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కెటిఆర్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కరెంట్‌, మంచినీళ్లు ఇవ్వని కాంగ్రెస్‌ ఇప్పుడు మాటలు చెబుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకే వారంటీ లేదని, ఇప్పుడు ఎలా గ్యారంటీలు ఇస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.200 పెన్షన్‌ ఇవ్వనోళ్లు ఇప్పుడు నాలుగు వేల పెన్షన్‌ ఇస్తా అంటే ఎలా నమ్మాలి అని ఎద్దేవా చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని ధ్వజమెత్తారు. ఎంఎల్‌ఎ టిక్కెట్లు అమ్ముకుంటున్నోడు రేపు రాష్టాన్ని అమ్మరా? అని నిలదీశారు. మాది గాంధీ వారసత్వం.. బిజెపిది గాడ్సే వారసత్వం అని విమర్శలు గుప్పించారు. ప్రధాని పాలమూరుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మాట్లాడితే చేతగాని మాటలు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అంటున్నాడు. బరాబర్‌ కుటుంబ పాలనే అందులో అనుమానమే లేదు. ఎందుకంటే.. కేసీఆర్‌ 4 కోట్ల మందికి కుటుంబ పెద్ద. 70 లక్షల మంది రైతులకు, వారి కుటుంబాలకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్నాడు. 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 4 వేలు పెన్షన్లు ఇచ్చి ఆసరాగా నిలబడి ఊతకర్ర అయ్యారు. 13 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి కింద లక్షా నూట పదహారు ఇచ్చి మేనమామ అయ్యారు. కేసీఆర్‌ కిట్‌ ఇచ్చి అన్నగా నిలబడ్డాడు. దళితబంధు ఇచ్చి దళితులను ఆదుకుంటున్నారు. ఇన్ని రకాలుగా అండగా నిలబడ్డ కేసీఆర్‌ది కుటుంబ పాలనే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలది వసుదైక కుటుంబం. ఈ కుటుంబానికి కేసీఆర్‌నే పెద్ద. ఇందులో నాకెలాంటి అనుమానం లేదు అని కేటీఆర్‌ తేల్చిచెప్పారు. రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాకున్నది తెలంగాణ తెగువ.. తెలంగాణ పౌరుషం. రాణి రుద్రమ్మ వారసత్వం కాబట్టే.. గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసుకున్నాం. గొప్ప గొప్ప ఆలయాలు.. యాదాద్రి వంటి ఆలయాలను కట్టుకున్నాం. ఆనాడు కాకతీయులు చేసిన పనిని ఈనాడు మళ్లీ కేసీఆర్‌ చేస్తున్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం వారసత్వం మాది. అందుకే ఆనాడు కుమ్రం భీం జల్‌ జంగల్‌ జవిూన్‌ అంటే.. ఈ రోజు అదే జల్‌ జంగల్‌ జవిూన్‌ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ది. పక్కా మాది కుమ్రం భీం వారసత్వమే. బహుజన వీరుడు సర్వాయి పాపన్న వారసత్వం మాది. బడుగు వర్గాలకు బలమిచ్చేలాగా, చేతి, కుల వృత్తులకు కొత్త ఊపిరినిచ్చిన ప్రభుత్వం ఇది. దళిత జాతి వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ వారసత్వం మాది. గురుకుల విప్లవంతో అణగారిన బిడ్డల్లో అక్షర వెలుగులు నింపుతున్న ప్రభుత్వం మాది. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి అద్భుతాలు చేస్తున్న ప్రభుత్వం మాది. ఉద్యమాల్లో అసువులుబాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది. శ్రీకాంతాచారి ఆశయాల వారసత్వం మాది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని ఇవాళ విధానంగా మార్చుకొని, సమర్థవంతంగా అమలు చేస్తున్న రాజకీయ వారసత్వం మాది. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని చెప్పిన దాశరథి, కాళోజీల సాంస్కృతిక వారసత్వం మాది. తల్లి తెలంగాణకు జన్మనిచ్చి, అస్థిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం, వారసత్వం, కేసీఆర్‌ నాయకత్వం మా సొంతం అని కేటీఆర్‌ ఉద్ఘాటించారు. మా విూద మాట్లాడే మోదీది ఏ వారసత్వం అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మాది జాతిపిత మహాత్మాగాంధీ వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. దిక్కుమాలిన పార్టీ నీది. మా విూద మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడితే కాంగ్రెసోళ్లకైనా, బీజేపోళ్లకైనా మంచిది. చేతనైతే ఏం చేస్తారో చెప్పండి.. ఏం చేశారో చెప్పండి అని కేటీఆర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్‌ తోపాటు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌, పలవురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌లు పాల్గొన్నారు.
మాది గాంధీ వారసత్వం.. మోదీది గాడ్సే వారసత్వం..
మా విూద మాట్లాడే మోదీది ఏ వారసత్వం అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మాది జాతిపిత మహాత్మాగాంధీ వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. దిక్కుమాలిన పార్టీ నీది. మా విూద మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడితే కాంగ్రెసోళ్లకైనా, బీజేపోళ్లకైనా మంచిది. చేతనైతే ఏం చేస్తారో చెప్పండి.. ఏం చేశారో చెప్పండి అని కేటీఆర్‌ సూచించారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.నిన్న ప్రధాని పాలమూరుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మాట్లాడితే చేతగాని మాటలు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అంటున్నాడు. బరాబర్‌ కుటుంబ పాలనే అందులో అనుమానమే లేదు. ఎందుకంటే.. కేసీఆర్‌ 4 కోట్ల మందికి కుటుంబ పెద్ద. 70 లక్షల మంది రైతులకు, వారి కుటుంబాలకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్నాడు. 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 4 వేలు పెన్షన్లు ఇచ్చి ఆసరాగా నిలబడి ఊతకర్ర అయ్యారు. 13 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి కింద లక్షా నూట పదహారు ఇచ్చి మేనమామ అయ్యారు. కేసీఆర్‌ కిట్‌ ఇచ్చి అన్నగా నిలబడ్డాడు. దళితబంధు ఇచ్చి దళితులను ఆదుకుంటున్నారు. ఇన్ని రకాలుగా అండగా నిలబడ్డ కేసీఆర్‌ది కుటుంబ పాలనే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలది వసుదైక కుటుంబం. ఈ కుటుంబానికి కేసీఆర్‌నే పెద్ద. ఇందులో నాకెలాంటి అనుమానం లేదు అని కేటీఆర్‌ తేల్చిచెప్పారు.
బీఆర్‌ఎస్‌ పార్టీది బరాబర్‌ వారసత్వ రాజకీయమే..
ఊసులేనోడు వచ్చి వారసత్వ రాజకీయం అని అంటున్నాడని కేటీఆర్‌ మండిపడ్డారు. పక్కా రాజకీయ వారసత్వమే. బీఆర్‌ఎస్‌ పార్టీది బరాబర్‌ రాజకీయ వారసత్వమే. రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాకున్నది తెలంగాణ తెగువ.. తెలంగాణ పౌరుషం. రాణి రుద్రమ్మ వారసత్వం కాబట్టే.. గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసుకున్నాం. గొప్ప గొప్ప ఆలయాలు.. యాదాద్రి వంటి ఆలయాలను కట్టుకున్నాం. ఆనాడు కాకతీయులు చేసిన పనిని ఈనాడు మళ్లీ కేసీఆర్‌ చేస్తున్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం వారసత్వం మాది. అందుకే ఆనాడు కుమ్రం భీం జల్‌ జంగల్‌ జవిూన్‌ అంటే.. ఈ రోజు అదే జల్‌ జంగల్‌ జవిూన్‌ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ది. పక్కా మాది కుమ్రం భీం వారసత్వమే. బహుజన వీరుడు సర్వాయి పాపన్న వారసత్వం మాది. బడుగు వర్గాలకు బలమిచ్చేలాగా, చేతి, కుల వృత్తులకు కొత్త ఊపిరినిచ్చిన ప్రభుత్వం ఇది. దళిత జాతి వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ వారసత్వం మాది. గురుకుల విప్లవంతో అణగారిన బిడ్డల్లో అక్షర వెలుగులు నింపుతున్న ప్రభుత్వం మాది. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి అద్భుతాలు చేస్తున్న ప్రభుత్వం మాది. 1952, 1969, 2001, 2014 ఉద్యమాల్లో అసువులుబాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది. శ్రీకాంతాచారి ఆశయాల వారసత్వం మాది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని ఇవాళ విధానంగా మార్చుకొని, సమర్థవంతంగా అమలు చేస్తున్న రాజకీయ వారసత్వం మాది. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని చెప్పిన దాశరథి, కాళోజీల సాంస్కృతిక వారసత్వం మాది. తల్లి తెలంగాణకు జన్మనిచ్చి, అస్థిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం, వారసత్వం, కేసీఆర్‌ నాయకత్వం మా సొంతం అని కేటీఆర్‌ ఉద్ఘాటించారు.మా విూద మాట్లాడే మోదీది ఏ వారసత్వం అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మాది జాతిపిత మహాత్మాగాంధీ వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. దిక్కుమాలిన పార్టీ నీది. మా విూద మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడితే కాంగ్రెసోళ్లకైనా, బీజేపోళ్లకైనా మంచిది. చేతనైతే ఏం చేస్తారో చెప్పండి.. ఏం చేశారో చెప్పండి అని కేటీఆర్‌ సూచించారు.
దళిత బంధుతో దళితుల జీవితాల్లో ఆర్థిక మార్పులు
ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దమ్మున్న నాయకులతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలోని అంబేద్కర్‌ విగ్రహం మురుగు వాహనాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు వాహనాలకు సంబంధించిన ప్రొసీడిరగ్స్‌ను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని తెలిపారు. గాంధీజీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్‌, పట్టణ, పల్లె ప్రగతి కార్య క్రమాలను చేపడుతున్నామన్నారు. దేశంలో ఎవరూ చెప్పని విధంగా సఫాయి అన్న నీకు సలా అని సీఎం కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా 162 సిల్ట్‌ కార్టింగ్‌ వాహనాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. వీటికో రూ.కోటికిపైగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతి వాహనానికి జలమండలి పని కల్పిస్తుందని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి వాహనాన్ని జలమండలి తనిఖీ చేస్తుందన్నారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలిస్తున్నారని చెప్పారు. శాంతియుత పో రాటం చేసి కేసీఆర్‌ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. గాంధీ ఫొటోలు పెట్టుకుని ఢల్లీిలో కొందరు నినాదాలు ఇస్తున్నారని విమర్శించారు. ఢల్లీిలో గాంధీజీ ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్ప.. ఆచరించరని విమర్శించారు. గాంధీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్‌, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అంతకుముందు వేదికపై గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, భేతి సుభాష్‌ రెడ్డి, ముఠా గోపాల్‌, ప్రకాశ్‌ గౌడ్‌, గోపీనాథ్‌, మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ పాల్గొన్నారు.