రాష్ట్రాల‌ది కరెంట్‌ షాకు

కేంద్రానిది పెట్రో బాదుడు
వరుసగా 16వరోజూ ఆగని ధర పెరుగుదల‌
న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): ఓవైపు.. కరోనా వైరస్‌ విజృంభనతో ప్రజు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్న వేళ పెట్రో ధరతో సామాన్యుపై కేంద్రం దాడి చేస్తోంది. కరోనా కష్టకాంలోనూ ప్రభుత్వాు దోపిడీ ఆపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాు విద్యుత్‌ బ్లిుతో ప్రజ నడ్డివిరిస్తే, పెట్రోు, డీజిల్‌ ధరను అంతకంతకూ పెంచుతూ… సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దాదాపు 3 నెల లాక్‌డౌన్‌తో జనం దగ్గర డబ్బుల్లేవు. ఆంక్షు తొగించినా… చాలా వ్యాపారాు మూతపడ్డాయి. ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ రోజురోజుకి పెట్రోల్‌ ధర
పెరుగుతోంది. వరుసగా 16వ రోజు కూడా పెట్రో ధరను వడ్డించాయి చమురు సంస్థు.. లీటర్‌ పెట్రోల్‌పై 33పైసు, డీజిల్‌పై 58 పైసు పెరిగింది. దీంతో.. 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.36గు పెరగగా… లీటర్‌ డీజిల్‌పై రూ. 8.85 వడ్డించాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరు ఒక్కటే కావడం దారుణానికి
పరాకాష్టగా చూడాలి. దేశంలో వరుసగా 18వ రోజూ పెట్రో ధరు పెరిగాయి. అయితే ఈసారి పెట్రోల్‌ వినియోగదారుపై చమురు కంపెనీు దయతలిచాయి. రోజువారీ సవిూక్షలో భాగంగా డీజిల్‌ ధరను మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ డీజిల్‌పై 48 పెంచగా, పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో మొదటిసారిగా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధర అధికమయ్యింది. తాజా పెంపుతో ఢల్లీిలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.88కి చేరగా, పెట్రోల్‌ ధర రూ.79.76గా ఉంది. దీంతో గత 18 రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరు రూ.8.50, రూ.10.48 చొప్పున పెరిగాయి. ప్రభుత్వ గణాంకా ప్రకారం 2012, జూన్‌ 18న దేశంలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.71.16, డీజిల్‌ ధర రూ.40.91గా ఉన్నది. ప్రస్తుతంతో పోల్చితే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.8 పెరగగా, డీజిల్‌ ధర 39.15 పైసు పెరిగింది. గత మార్చి 14న ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ.3 విధించగా, మే 5న పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది. ఈ రెండు పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.2 క్ష కోట్లు వచ్చాయి.