రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలను గొప్పగా గౌరవిస్తున్నది
హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్28(జనంసాక్షి) ఆడబిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస అన్నారు.హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎంపీపీ మానస పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలను ఊరూరా పంపిణీ చేస్తుండడం పట్ల మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ లను మెచ్చుకుంటున్నారని ఆమె అన్నారు. మహిళల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు, గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీ ఓ సత్యనారాయణ, మండల ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు, బొమ్మగాని శ్రీనివాస్, సర్పంచ్ బత్తిని సాయిలు, వంగ విజయ, తారాలత, ఇస్లావత్ రజిత, కొలవేణి లత, దుండ్ర భారతి, ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు టిఆర్ఎస్, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు