రాష్ట్ర సర్కారు నిర్ణయం అభినందనీయం
– ఈటీసీఏ అధ్యక్షుడు కిరణ్
నిబంధనలకు విరుద్ధంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి తీసుకువస్తామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అభినందనీ యమని ఎమిరైట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేష్ (ఈటీసీఏ) అధ్యక్షుడు కిరణ్ అన్నారు. శనివారం ఆయన జనంసాక్షితో ఫోన్‌లో మాట్లాడారు. వీసా నిబంధనల కారణంగా చిక్కుకున్న వారికి ప్రభుత్వం బాసటగా నిలవాలని నిర్ణయించడం సరైందేకాని కాస్త ముందుగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. తాము ఇక్కడ చిక్కుకున్న పేదలను స్వదేశానికి పంపడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంతకాలానికైన సర్కారు మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. గల్ఫ్‌లో చిక్కుకున్నవారి బంధువులు తమను సంప్రదిస్తే వారిని స్వదేశానికి పంపడానికి కృషి చేస్తామని తెలి పారు. వివరాలకు ఫోన్ నంబర్ : 00971-557156057లో సంప్రదించాలని సూచించారు.