రాహుల్​ గాంధీతో జోడో యాత్రలో టీఆర్​ఆర్​

పరిగి రూరల్​, అక్టోబర్​ 23 ( జనం సాక్షి )  :
భారత్​ జోడో యాత్ర ఆదివారం మక్తల్​ చేరువలోకి రాగానే జోడోయాత్రతో రాష్ర్ట స్థాయి లాజిస్టిక్స్​ కమిటీ చైర్మన్​, డీసీసీ అధ్యక్షులు టి.రాంమ్మోహన్​ రెడ్డి, మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డిలతో కలిసి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డిలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా రాహుల్​ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డిలతో కలిసి 4 కిలోమీటర్లు జోడోయాత్రలో ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, టీఆర్​ఆర్​ పాల్గొన్నారు. 27వ తేదీన నిర్వహించే భారత్​ జోడో యాత్రకు పెద్ద ఎత్తు జన సమీకరణ చేస్తున్నామన్నారు. వికారాబాద్​ జిల్లాకు సమీపంలో  షాద్​ నగర్ లో 30 వతేదీన నిర్వహించే భారత్​ జోడో యాత్రకు మరింత జనాలు సేకరించి విజయవంతం చేసేందుకు చేస్తున్నామని చర్చించినట్లు  డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్​ రెడ్డి తెలిపారు.
ఫోటో రైటప్​ :
23 పిఆర్​ జి  05లో రాహుల్​ గాంధీ జోడో యాత్రకు స్వాగతం పలికి పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్​ రెడ్డి