రాహుల్‌కు డ్రగ్స్‌ అలవాటుంది

కొకైన్‌ వాడుతాడని స్వామి సంచలన వ్యాఖ్యలు

డోప్‌ టెస్ట్‌ నిర్వహిస్తే తేలుతుందని వెల్లడి

న్యూఢిల్లీ,జూలై6(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బిజెపి సీనియర్‌ నేత, ఎంపి సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్‌ కొకైన్‌ తీసుకుంటారని ఆయన ఆరోపించారు. పంజాబ్‌ లో డ్రగ్స్‌ వినియోగం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖతో పాటు ప్రభుత్వోద్యోగులందరికీ డోప్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్వామి స్పందిస్తూ, పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందు రాహుల్‌ గాంధీకి పరీక్షలు నిర్వహించాలన్నారు. రాహుల్‌ కొకైన్‌ తీసకుంటారని, డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తే ఖచ్చితంగా విఫలమవుతారని పేర్కొన్నారు.

పంజాబ్‌ ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ స్పందిస్తూ, పంజాబ్‌ లో డ్రగ్స్‌ తీసుకునేవారు 70 శాతం మంది ఉన్నారని ఆరోపించిన వారే వాటిని ఉపయోగిస్తున్నారని, వారికే ముందు డోప్‌ టెస్ట్‌లు చేయాలని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని స్వామి అన్నారు.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి రాహుల్‌ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్‌ కొకైన్‌ తీసుకుంటారని ఆయన ఆరోపించారు. పంజాబ్‌ లో డ్రగ్స్‌ వినియోగం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖతో పాటు ప్రభుత్వోద్యోగు లందరికీ డోప్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్వామి స్పందిస్తూ, పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందు రాహుల్‌ గాంధీకి డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ కొకైన్‌ తీసుకుంటారు కాబట్టి… డోప్‌ టెస్టులో కచ్చితంగా ఆయన విఫలమవుతారని ఎంపీస్వామి పేర్కొనటం వివాదాస్పదంగా మారింది. పంజాబ్‌లో 70? ప్రజలు డ్రగ్స్‌ తీసుకుంటున్నారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ‘రాహుల్‌ గాంధీ కూడా డ్రగ్స్‌కు బానిసే. ఇంకా చెప్పాలంటే.. ఆయన కొకైన్‌ తీసుకుంటారు. ఆయనకు డోప్‌ టెస్ట్‌ నిర్వహిస్తే.. కచ్చితంగా తేలుతుంది’ అని గురువారం ఓ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్‌స్మిత్‌ కౌర్‌ బాదల్‌ కూడా పరోక్షంగా రాహుల్‌గాంధీని విమర్శించారు. ’70 శాతం పంజాబీలు డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారని చెప్పేవారే డ్రగ్స్‌కు బానిసలు’ అని వ్యాఖ్యానించారు.