రాహుల్ సభను విజయం చేయండి: జానా
హైదరాబాద్,అక్టోబర్19(జనంసాక్షి): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో బీసీ సంఘం
నాయకుడు ఆర్. కృష్ణయ్య సమావేశం అయ్యారు. అనంతరం జానారెడ్డి విూడియాతో మాట్లాడుతూ
శనివారం తెలంగాణలో జరగనున్న అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభను జయప్రదం చేయాలని ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు.. వారే కాకుండా యావత్ ప్రజలంతా పాల్గొని సభను జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడానికి అందరూ సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.