రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వాలు పోస్టర్ విడుదల
గంగారం అక్టోబర్ 23 (జనం సాక్షి)
ములుగు నియోజకవర్గం
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కమట్ల గూడెం గ్రామ పంచాయతీ కేంద్రం లో రాహుల్ గాంధీ పాదయాత్ర భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్న శుభ తరుణంలో ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ఆదేశాలమేరకు ఈ రోజు భారత్ జోడో యాత్ర వాలు పోస్టర్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు పార్టీ ముఖ్య నాయకులు మరియు మండల ఎన్రోలర్ అద్వర్యంలో ఆవిష్కరణ చేసి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణపాక సరోజన, జడ్పిటిసి ఈసం రమ సురేష్,ముడిగ వీరభద్ర పోతయ్య వైస్ ఎంపీపీ, మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, పెనక పురుషోత్తం వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి రాధారపు కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు