రిజర్వేషన్ పెంపు పట్ల సంబరాల్లో మునిగి తేలిన గిరిజనులు.

నెరడిగొండఅక్టోబర్1(జనంసాక్షి):ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గిరిజన ఆదివాసుల చిరకాల కోరిక 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తు జీవోను విడుదల చేసిన సిఎం కెసిఆర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మండల కేంద్రంలో శనివారం రోజున బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదేశానుసారం మండల ఎంపీపీ రాథోడ్ సజన్ ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీలతో కలసి సంబరాల కార్యక్రమాలు మిన్నంటాయి.10శాతం పెంపు జీవో ప్రకటించిన వెంటనే ఆదివాసులు గిరిజనులతో  కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రాథోడ్ సజన్ కన్వీనర్ శివారెడ్డి సర్పంచ్లు విశాల్ సుభాష్ మహేందర్ నారాయణ ఆదివాసి గిరిజనులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.