రిలే నిరాహార దీక్షలకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు కలిసి రావాలి

ఇటిక్యాల జులై   (జనంసాక్షి) ఎర్రవల్లి చౌరస్తాను నూతన మండల ఏర్పాటుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధుల సహకరించి రిలే నిరాహార దీక్షలకు కలిసిరావాలని మండల సాధన సమితి అధ్యక్షులు పి. రాగన్న కృష్ణ సాగర్ లు కోరారు. గురువారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత అయిదు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 నూతన మండలాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఉన్న ఎర్రవల్లి చౌరస్తాను మండల కేంద్రంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో నేటి నుండి ఎర్రవల్లి చౌరస్తాను మండల మండల కేంద్రముగా ప్రకటించే వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, బీచుపల్లి, తిమ్మాపురం, పుటాన్ దొడ్డి, కొండేరు, సాసనులు, ధర్మవరం, జింకలపల్లి, గార్లపాడు, వీరాపురం, కారుపాకుల, షేక్ పల్లి, యాక్తాపురం, దువాసిపల్లి, బి.వెంకన్న పల్లి గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజలు రిలే నిరాహార దీక్షలో పాల్గొని మండల సాధనకై కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి, బీచుపల్లి సుధాకర్, నరసింహారెడ్డి, పెద్ద లక్ష్మన్న, వెంకటన్న, జమ్మన్న, బీఎస్ఎన్ఎల్ నాగశేషులు తదితరులు పాల్గొన్నారు.