రుద్రంగిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రుద్రంగి అక్టోబర్ 16 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం
జెడ్పి.హెచ్.ఎస్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 1989-90 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పూర్తి చేసిన 80 మంది విద్యార్థిని,విద్యార్థులు వారి వారి కుటుంబాలతో సహ పాఠశాలకి విచ్చేసి మధుర జ్ఞాపకాలను నెమరు వేసు కుంటూ కుటుంబాలతో సహ ఆడి పాడి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.అలాగే వారికి భోదించిన గురువులు మరిపెల్ల అంతయ్య, రఘు కిషోర్,లింగరెడ్డి,ఎర్రోజు చారి,పి.ఈ.టి లక్ష్మి నారాయణ,ఆలూరి సత్య నారాయణ,శంకర్ శర్మ తో పాటు స్థానిక హెచ్ఎం అంబటి శంకర్ లను శాలువతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యా ములు మాట్లాడుతు.. 32 సంవత్సరాల తరువాత గుర్తుంచుకొని మమ్మల్ని పిలిచి సన్మానించడం ఆనందగా ఉందని మరియు చదివిన పాఠశాలకు ఆర్థికంగా చేయువ అందించి పాఠశాల అభివృద్ధిలో పాలు పంచు కోవాలని కోరారు.పూర్వపు విద్యార్థులు దొంతినేని శ్రీదర్ రావు,చెలుకల కృష్ణ,దరిపెల్లి గంగాదర్,అంబాటి గంగాదర్, ఎల్లాల నర్సారెడ్డి, మంచే గంగాధర్, పూర్ణచందర్,గట్ల ప్రకాశ్,దోపిడి శ్రీను,తలారి నర్సయ్య,నరేష్,వెంకటేష్,చంద్రమౌళి,శివ కైలాస్,రమేష్,మల్లేశం,అచ్యుత్ తో పాటు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.