రుద్రంగిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి);
ఆర్ఏస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రుద్రంగి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అంబెడ్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అనంతరం బైక్ ర్యాలీ ఇందిరా చౌక్ వరకు వెళ్లి అక్కడ టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు.అనంతరం బీస్పీ నాయకులు ప్రవీణ్ కుమార్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగ రుద్రంగి మండల అధ్యక్షులు కట్కూరి శంకర్ మాట్లాడుతూ…
విద్య,వైద్యం,ఆర్దికం,బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం అని అన్నారు.అలాగే బిసి లకు బీఎస్పీ తరపున 70 సీట్లు ఇస్తామని బీజేపీ,టిఅర్ఎస్
,కాంగ్రెస్ పార్టీలకు సవాలు విసరడం జరిగిందని
అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేశవేణి భూమేశ్,గ్రామశాఖ అధ్యక్షులు మరియు వేములవాడ నియోజక వర్గ సోషల్ మీడియా ఇంచార్జి కాదాసు మహేందర్,సెక్టార్ ఇంఛార్జి కాదాసు అరుణ్,సెక్టార్ కార్యదర్శులు లింగాల రవి,ఏనుగందుల సతిష్,కాదాసు అనిల్,
కట్కూరి వినోద్, జిల్లా కార్యదర్శి దర్శనం గంగాధర్,సీనియర్ నాయకులు కట్కూరి రమేశ్,నాయకులు లింగంపెళ్లి సుదర్శన్,కాదాసు సంతోష్,కట్కూరి అనిల్,తర్రె రాజేందర్,దాసు,
ప్రణయ్,మల్లేశ్,తదితరులు పాల్గొన్నారు.
Attachments area