రుద్రంగి లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

రుద్రంగి ఆగస్టు 2 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం నాగుల
పంచమి సందర్భంగా రుద్రంగి మండలంలోని వివిధ ఆలయాల్లో ఉన్న పుట్టలలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే నాగుల పంచమి లో భాగంగా పుట్టలలో పాలు పోయడం మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ గా వస్తున్న ఆచారం అని మహిళలు తెలిపారు. నాగదేవత ఆశీస్సులు తమపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ దేవతను కోరుకున్నట్లు తెలిపారు