రుద్రంగి లో ఘనంగా మాత్మ గాంధీ జయంతి వేడుకలు

రుద్రంగి అక్టోబర్ 2 (జనం సాక్షి)
మండల కేంద్రంలో ఆదివారం జాతిపిత మాత్మ గాంధీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ భాస్కర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్,జడ్పిటిసి గట్ల మీనయ్య, ఎంపీడీవో శంకర్,టెంపుల్ చైర్మన్ కొమిరే శంకర్,మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు చేలుకల తిరుపతి, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ప్రబలత మనోహర్,మానాలలో వైసీపీ పీసరి భూమయ్య,సర్పంచ్ మానస ల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.