‘రుద్రనేత్రి’ సినిమా రివ్యూ… వినోదాత్మకంగా సాగే సందేశాత్మక చిత్రం

 

చిత్రం : రుద్రనేత్రి
విడుదల తేది : అక్టోబర్ 14, 2022.

నటీనటులు:
మేఘన చౌదరి, పోసాని కృష్ణ మురళి,
జయవాణి, జాబర్దస్త్ అప్పారావు,
కుమార్ వర్మ, వృశాలి, ఆరోహి గోసవి,
శ్యాం, లింగ గుగులోతు
నిర్మాత: లింగ గుగులోతు (ఈశ్వర్)
దర్శకత్వం: తిరుపతి కె వర్మ
సంగీతం: జయంత్
సినిమాటోగ్రఫి: వి.వి.ఎస్ చారి (వి.విద్య సాగర్)
ఎడిటర్: వినయ్ రామ్

కథలోకి వెళదాం..
సూర్య (కుమార్ వర్మ) అనాథ మరియు ఒక వృద్ధ మహిళ వద్ద పెరుగుతాడు. కానీ అతను తన అనుచరులతో కలిసి ప్రయాణికులను దోచుకుంటూ అమ్మాయిలను రేప్ చేస్తుంటాడు. బాధితుల్లో మధు (వ్రుశాలి) మరియు శ్రీమతి గంగ (ఆరోహి) వుంటారు. రుద్రనేత్రి వేషధారణలో ఉన్న గంగ, మధుతో కలిసి సూర్యతో సహా రేపిస్టులు మరియు హంతకులందరినీ చంపుతుంది.

విశ్లేషణలోకి వెలదాం..
మూస కథ అనిపించేలోపే ఒక పాట వస్తుంటుంది. సినిమాలో ఏడు పాటలు పెట్టి దర్శకుడు మంచి పని చేశాడు అనిపిస్తుంది. ముగ్గురు హీరోయిన్స్ గ్లామర్ ని దర్శకుడు బాగా వాడుకున్నాడు. పోసాని కృష్ణ మురళి, జయవానిలు ఫర్వాలేదు అనిపించారు. క్లైమాక్స్ లో ఆరోహి, వ్రుశాలి, కుమార్ వర్మ నటన బాగుంటుంది. శ్యాం లవర్ బాయ్ గా మెప్పిస్తాడు. సంగీతం దర్శకుడి పనితనం బాగుంది.
ప్లస్ పాయింట్స్: పాటలు, హీరోయిన్స్ గ్లామర్ గా కనిపించడం.
మైనస్ పాయింట్స్: కథనం కొంచెం నెమ్మదించింది.
చివరగా : వినోదాత్మకంగా సాగే సందేశాత్మక చిత్రం
రేటింగ్ :3.75