రుద్రూర్ నూతన గ్రంధాలయ నిర్మాణం కోసం 35 లక్షలు మంజూరు భవిష్యత్తులో ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’
రుద్రూర్ (జనంసాక్షి) : రుద్రూర్ మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరల నుండి ఎంతో మంది విద్యార్థులుకు, సామాజిక వేత్తలకు, రాజకీయ నాయకులకు, ఎన్నో విలువైన పుస్తకాలను , వార్త పత్రికలను అందించిన రుద్రూర్ గ్రంథాలయ బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన విషయం తెలిసినదే. ఈ విషయం తెరాస మండల నాయకులు దృష్టికి రాగానే , సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొని పోయి , గత కొన్ని రోజుల క్రితం గ్రంథాలయ అద్దె బిల్డింగ్ ను చూపించి కొత్త గ్రంథాలయ నిర్మాణ కోసం నిధులను మంజూరు చేయాలని కోరారు , సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో రుద్రూర్ మండల ప్రజల చిరకాల కోరిక రుద్రూర్ నూతన గ్రంధాలయ నిర్మాణం కోసం కావలసిన నిధులు 35 లక్షలు మంజూరు అయ్యాయని తెరాస మండల నాయకులు జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపిపి ఆక్కపల్లి సుజాత నాగేందర్, మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ జనంసాక్షి తో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రంథాలయాలను ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైన అన్ని పుస్తకాలను సమకూర్చుతూనే, విషయ నిపుణులతో ఉచితంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి రూపకల్పన భవిష్యత్తులో చేస్తున్నది తెలిపారు .ఇంతకాలం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలను మాత్రమే చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఉద్యోగార్థుల అభిరుచులు, అవసరాల మేరకు పుస్తకాలను తెప్పిస్తున్నారు. ఏ పుస్తకం కోరుకుంటే, ఆ పుస్తకాన్ని మార్కెట్ నుంచి తెప్పించి గ్రంథాలయాల్లో అందుబాటులో
ఉంచే ప్రణాళికలు సీఎం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. దీనికోసం ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ను ప్రవేశపెట్టానున్నారని తెలిపారు. ఏళ్ల నుండి అమలు కు నోచుకోని గ్రంధాలయ నిర్మాణం కోసం నిధులు కేటాయించి న సభాపతి కి రుద్రూర్ గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు , గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు



