రూమ్ టు రీడ్ ఆధ్వర్యంలో జీవన నైపుణ్యాలపై శిక్షణ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 6(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూల్ కేజీబీవీ పాఠశాల లో సిఆర్ టి ఉపాధ్యాయులకు రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత మూడు రోజుల పాటు జీవన నైపుణ్యాల పై శిక్షణ ఇవ్వడం జరిగింది.మొత్తం 60 మంది ఉపాధ్యాయు లకు శిక్షణ ఇచ్చినట్లు రూమ్ టు రీడ్ జిల్లా కో.ఆర్డినేటర్ శ్రీలత తెలిపారు.బుదవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిసిడిఓ సూర్య చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ నేటి బాలబాలికల్లో చాలామందికి భావవ్యక్తీకరణ సామర్థ్యం పెంచాలని, సమాజంలో జరుగుతున్న అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.దీనికి తోడు సురక్షితం కాని అంతర్జాల వినియోగం తో బాల బాలికల పై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని కాబట్టి ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.సంస్థ జిల్లా కోఆర్డినేటర్ శ్రీలత మాట్లాడుతూ మూడు రోజుల ట్రైనింగ్ లో చదువుతో పాటు బాలబాలికల్లో జీవన నైపుణ్యాల పెంపునకు ఏవిధంగా కృషి చేయాలో ముఖ్యంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం భావవ్యక్తీకరణ, ఋతుస్రావం పై అవగాహన, ఆరోగ్యకరమై న సంబంధాలు, సురక్షిత ప్రదేశాలను గుర్తించడం, సమయపాలన పాటించడం, నాయకత్వ లక్షణాలు, పొదుపు చేయడం,ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తలు పాటించడం,ఆడ మగ తేడా లేకుండా లింగ సమానత్వం తో ఉండడం, స్వీయ గుర్తింపు, సామాజిక అవగాహన మరియు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.ఈ ట్రైనింగ్ కి సహకారం అందించి న డిఇఓ గోవిందరాజు కు,నాగనూల్ కేజీబీవీ ఎస్ఓ శోభారాణి కి రూమ్ టు రీడ్ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ నుంచి
ఎస్ పి ఏ సుధ,ఆర్ టి ఆర్ పిఓ సరిత, జిల్లా కోఆర్డినేటర్ లు శ్రీలత,వెంకటలక్ష్మి, ఉదయశ్రీ,కృప, మరియు మాస్టర్ ట్రైనర్స్ విజయ్ కుమార్, హరికృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.