రూ. 1. 18 కోట్లతో ఉడాయించిన మహిళ
షాపూర్‌నగర్ : చిట్టీల పేరుతో రూ. 1.18 కోట్లను తీసుకోని ఓ మహిళ పరారైంది. చింతల్‌వాణి నగర్‌కు చెందిన మహేశ్వరి చిట్టీల పేరుతో దాదాపు 43 మంది మహిళల నుంచి డబ్బును వసూలు చేసింది. ఈ మేరకు జీడిమెట్ల పోలీసుస్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.