రూ.9,860 కోట్ల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పెట్టుబడులు -సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఖైరతాబాద్ ; జూన్ 11 (జనం సాక్షి) ప్రపంచంలోని అతిపెద్ద ఆభరణాల రిటైల్ చైన్లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాబోయే మూడేళ్లలో భారతదేశంలో రూ.9,860 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఇటీవల కొచ్చిలో జరిగిన ఇన్వెస్టర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ.అహమ్మద్, ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ.ఆషర్ సంయుక్తంగా ఈ పెట్టుబడుల విషయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోల్, కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ పాల్గొన్నారు. మలబార్ ట్రెజరీ అండ్ బులియన్ హెడ్ దిలీప్ నారాయణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మలబార్ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా, మార్కెట్ టు ది వరల్డ్’ చొరవను మరింత బలీయం చెయ్యడానికి ఇటీవలి కాలంలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తోంది. 2025 నాటికి 500 కొత్త షోరూములను ప్రారంభించాలని మలబార్ యోచిస్తోంది. ఫలితంగా సుమారు 11,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని బలోపేతం చేయడంలో వ్యాపార విస్తరణ ప్రణాళికల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంలో మలబార్ సంస్థ చేసిన ఉత్తమ ప్రయత్నాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఈ విషయంలో కంపెనీ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Attachments area