రెండు పార్టీల మధ్య పోరాటం కేటీఆర్‌

14KTR_83ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెరాసను ఒంటరిగా ఎదుర్కోలేని పార్టీలన్నీ ఏకమయ్యాయని విమర్శించారు. గడిచిన రెండేళ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు పరాజయమేనని, ఓటమికి కాంగ్రెస్‌ పర్యాయ పదంగా మారిందని ఎద్దేవా చేశారు. సానుభూతి పేరిటి కొత్త తరహా నాటకానికి కాంగ్రెస్‌ తెరలేపిందని విమర్శించారు. తుమ్మల అభ్యర్థిత్వం ఖరారుతో పాలేరు అభివృద్ధిపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… గోదావరి జలాలను భవిష్యత్తులో పాలేరు నియోజకవర్గానికి అందించేందుకే భక్తరామదాసు ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు. దేశచరిత్రలోనే రికార్డు సమయంలో భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. పాలేరు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరందించే బాధ్యత తమదేనన్నారు.