రెండు పార్టీల మధ్య పోరు

4

– అభివృద్దికోసం తుమ్మలను గెలిపించండి

– మంత్రి కేటీఆర్‌

ఖమ్మం,మే14(జనంసాక్షి):పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు ఉప ఎన్నికలో మంత్రి తుమ్మలను అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్దికి బాటవేయాలని మంత్రి కెటి రామారావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడమే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచే/-తున్నారని,  ప్రజల కోసం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించాలని, ఈ నెల 16న జరుగనున్న పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కెటిఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన 23నెలల్లో తెరాస ప్రభుత్వం ప్రజల మనస్సులను గెలుచుకుందన్నారు. శనివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు.పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలకు జరుగుతున్నది వ్యక్తుల మధ్య పోటీకాదని, రెండు పార్టీల మధ్య పొత్తు అని మంత్రి తారక రామారావు అన్నారు. ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలను ఉతికి ఆరేశారు. పదకొండుసార్లు పాలేరులో గెలిచిన కాంగ్రెస్‌ పాలేరు ప్రజలకు చేసిందేవిూలేదని విమర్శించారు. తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గెలిచిన రెండు సంవత్సరాల్లోనే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లిందన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ఖమ్మం జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా మారుతుందని స్పష్టం చేశారు. భక్త రామదాసు ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. గోదావరి జలాలలో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. తుమ్మలతోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు సష్టిస్తున్న వైఎస్‌ జగన్‌ విధానాలను నిరసిస్తూ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  రానున్న కొద్ది రోజుల్లోనే ప్రతి ఇంటికి తాగునీటిని అందజేస్తామని కెటిఆర్‌ అన్నారు.  50ఏళ్లుగా పాలేరు ప్రజలు ఓట్లు వేస్తూనే ఉన్నారు. గెలిచిన నాయకులు నియోజకవర్గాన్ని బాగుచేయక పోవడంతో పాలేరు ఇంకా కరవు కోరల్లో కొట్టు మిట్టాడుతుందన్నారు. ఇంకా గిరిజన తండాలకు సరైన రహదారులు లేవని తెరాస పార్టీ గెలిస్తే ప్రతి మారుమూల గిరిజన తండాలకు బీటీ రహదారులు వేయిస్తామన్నారు. తుమ్మల తన కుడిభజం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారని, అటువంటి కుడిభుజంను గెలిపించుకొని విూ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాలేరులో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు చేసి వారి నోళ్లు మూయించాలన్నారు. గతంలో 40ఏళ్ల క్రితం పాలేరు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు.  60ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు, నిధులు, నియమకాలు, ఆంధ్రా పాలకులు కొల్లగొట్టుక పోతుంటే, పదవుల కోసం పెదవులను మూసి సీమాంధ్ర పాలకుల వద్ద మోకరిళ్లిన నాయకులు నేడు ప్రజల్లోకి వచ్చి ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతరని ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గంలో 11సార్లు గెలిచిన కాంగ్రెస్‌, రెండు సార్లు గెలిచిన సీపీఎం గెలిచిన సీపీఐలు పాలేరు ప్రజలకు ఏ ఒక్కరోజైనా మంచి పనులు చేశారా? అని ప్రశ్నించారు. పాలేరు ప్రజలకు ఇదిగో ఈ పనిచేశామని చెప్పే సత్తా ఉందా..? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉందన్నారు.ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లోనే ప్రజలకు ఏం కావాలో, వాళ్లు అడక్కపోయినప్పటికీ గుర్తించి పరిష్కరించిందన్నారు. ఆడబిడ్డలకు ఇంటింటికీ నల్లానిచ్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమందించిందని, రెండేళ్లలో 1800 చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టిడిపి కాంగ్రెస్‌ తోకపార్టీగా తయారూ ఎన్టీఆర్‌ ఆత్మక్షోభించేలా చేస్తోందన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదన్నారు. త్వరలోనే ఈ రెండు పార్టీలు కనుమరుగు కాగలవన్నారు. ఓటమి భయంతోనే ఇక్కడ కొత్త పొత్తులకు తెరతీసారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఖమ్మంలో మంత్రులు తుమ్మల, కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు. నిధులు, నియామకాల సమస్య తీరిందని, ఇక మిగిలింది నీళ్లేనని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రాజెక్టులు గుర్తు రాలేదని విమర్శించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీటిని అందజేస్తామని హావిూ ఇచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనుసును గెలుచుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్ట్‌తో ఖమ్మం జిల్లా.. భక్త రామదాసు లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 50ఏళ్లుగా పంటపొలాలకు నీళ్లు రాక కన్నీళ్లతో బతికారని, ఇక ఆ సమస్యను తీర్చడం కోసం సీఎం కేసీఆర్‌ గోదావరి జలాలతో ప్రజల వాకిళ్లు తడుపుతారన్నారు.  బిడ్డ కడుపులో పడ్డదగ్గర నుంచి పుట్టి పెద్దపెరిగి పెళ్లి చేసే వరకు బాధ్యతను తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఇళ్లులేని పేదలకు ఇళ్లు కట్టించి పెళ్లి చేసుకుంటున్న ప్రతి పేదింటి పెళ్లికూతురుకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.51వేలు అందజేస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న టీడీపీ చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నందుకు కాంగ్రెస్‌పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించాలని కోరారు. పాలేరు రిజర్వాయర్‌ గోదావరి ఎందుకు మళ్లించలేకపోయారో, ఎందుకు ప్రాజెక్టులను నిర్మాణం చేసి, ప్రతి ఎకరానికి నీటిని అందించలేకపోయారో సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉత్తరకుమారుడికి ఉందా..?అని ప్రశ్నించారు.చొక్క ఎరుపు, జెండా ఎరుపు, కానీ మనుషులు మాత్రమే నలుపని మంత్రి జగదీశ్‌రెడ్డి కమ్యూనిస్టు పార్టీ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు పార్టీలు ఎర్రజెండాపేరుతో, ప్రజల పార్టీ, పేదల పార్టీ అంటూ గొప్పలు చెప్పడం, ఆ తరువాత దోచుకోవడం వారి పద్‌ధ్దతని ఆరోపించారు. ఎర్రజెండా పేరుతో దోపిడీ చేస్తున్నారని మంత్రి విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్‌కు 11సార్లు ఓట్లు వేసి, సీపీఎంకు 2 సార్లు ఓట్లు వేసి మోసపోయారని, ఇప్పుడు ఆ తప్పుడు పనిచేయకుండా అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసుకోవాలని విజఙప్తి చేశారు. పనిచేసే వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి కోసం ఆరాటపడే మనిషని, అభివృద్ధి కోసమే ఆయన పాలన ఉంటుందన్నారు. అలాంటి నాయకుడ్ని అత్యధిక మెజారిటీతో ఓట్లువేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌: కెటిఆర్‌

పాలేరు ఉప ఎన్నికల్లో చివరిరోజు శనివారం టీఆర్‌ఎస్‌ ప్రాచరం ముమ్మరం చేసింది. పలుచోట్ల మంత్రులు ప్రాచరాం నిర్వహించారు.  ఈమేరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంచాయి. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఖమ్మంలో మాట్లాడుతూ  మంత్రులంతా మూకుమ్మడిగా వచ్చి పాలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టారు. తాము మంత్రులుగా పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంలేదని, సాదాసీదీ కార్యకర్తలుగానే ప్రచారం కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. తాము మొదట టీఆర్‌ఎస్‌ కార్యకర్తలమని తర్వాతే మంత్రులమని పేర్కొన్నారు. కార్యకర్తలుగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటర్లు గెలిపిస్తేనే తమకు ఈ మంత్రి పదవులు వచ్చాయని వివరించారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితమే పాలేరులో పునరావృతం కావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని పేర్కొన్నారు. పాలేరులో ప్రతీ ఇంటికి సాగునీరు, ప్రతీ ఎకరాకు సాగునీరు అందించే సత్తా టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని తెలిపారు. అందుకు కారు గుర్తుకు ఓటు వేసి పాలేరు నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దివంగత పాలేరు మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చికిత్స కోసం సీఎం కేసీఆర్‌ రూ.కోటి కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఓటవిూని ఎదుర్కోలేని కాంగ్రెస్‌ పార్టీ తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు.  అసలు అవినీతికి విశ్వవిద్యాలయం వంటిది కాంగ్రెస్‌ పార్టీ అని పేర్కొన్నారు. ఆ విశ్వవిద్యాలయంలో అవినీతిపై పీహెచ్‌డీలు చేసిన నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి వారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో పనిచేసిన నేతలు ఇవాళ అవినీతి ఆరోపణలెదుర్కొంటోన్నారని విమర్శించారు. అవినీతి కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొంటోన్న వాళ్ల ఇవాళ అవినీతిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమపై అవినీతి ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.  తెరాసను ఒంటరిగా ఎదుర్కోలేని పార్టీలన్నీ ఏకమయ్యాయని విమర్శించారు. గడిచిన రెండేళ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు పరాజయమేనని, ఓటమికి కాంగ్రెస్‌ పర్యాయ పదంగా మారిందని ఎద్దేవా చేశారు. సానుభూతి పేరిటి కొత్త తరహా నాటకానికి కాంగ్రెస్‌ తెరలేపిందని విమర్శించారు. తుమ్మల అభ్యర్థిత్వం ఖరారుతో పాలేరు అభివృద్ధిపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… గోదావరి జలాలను భవిష్యత్తులో పాలేరు నియోజకవర్గానికి అందించేందుకే భక్తరామదాసు ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు. దేశచరిత్రలోనే రికార్డు సమయంలో భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. పాలేరు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరందించే బాధ్యత తమదేనన్నారు.