రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు.

ఊరుకొండ, అక్టోబర్ 22 (జనం సాక్షి):
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. మరొకరికి స్వల్ప గాయాలైన సంఘటన ఊరుకొండ మండలంలోనీ ముచ్చర్లపల్లి – రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్య శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వెంకటేష్ అతని భార్య అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి కల్వకుర్తిలో ప్రాజెక్టు మీటింగ్ కు వెళ్లి స్వగ్రామమైన రాంరెడ్డిపల్లికి చేరుకునే సమయంలో ముచ్చర్లపల్లి – రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్యలోకి రాగానే.. అదే గ్రామానికి చెందిన హరీష్ ముచ్చర్ల పల్లి వైపు వెళుతున్నా క్రమంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేష్, హరీష్ లకు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటేష్ భార్య స్వల్ప గాయాలు కాగా ముగ్గురినీ స్థానికులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.