రెండో రోజుకు చేరిన విఆర్ఏ ల నిరవధిక సమ్మె

జుక్కల్, జూలై26,జనం సాక్షి,
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల తహాసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన
విఆర్ఏల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది.ఈ సందర్బంగా పెద్ద కొడప్ గల్ మండల విఆర్ఏ ల సంఘం అధ్యక్షులు షేఖ్ లియాకత్ అలీ మాట్లాడుతు తెలంగాణా రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేపట్టామని తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏ ల కిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.55 సంవత్సరాల వయస్సుకు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలని,పేస్కెల్ జీవో విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల ఉపాధ్యక్షులు ఎం. నాగయ్య ,మండలంలోని వివిధ గ్రామాల విఆర్ఏ లు పాల్గొన్నారు.