రెండో వన్డేలో కుప్పకూలిన భారత్
హోంబన్‌టోట, జూలై 24(జనంసాక్షి): మొదటి వన్డేలో అదరగొట్టిన టీమిండియా రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. చెత్త బ్యాటింగ్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. తొలి వన్డేలో పరుగుల వరద పారడంతో టాస్ గెలిచిన ధోని మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌలర్ పెరీరా పట్టిన అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరుకున్నాడు. ఇక్కడ నుండి భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అది కూడా వేగంగా క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లే పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి మ్యాచ్‌లో సెంచరీ హీరో విరాట్ కోహ్లీ 1, రైనా 1, రోహిత్ శర్మ డకౌటయ్యారు. కెప్టెన్ ధోని రెండు ఫోర్లతో జోరు మీద కనిపించినా అది కాసేపేనని తేలిపోయింది. ధోని 11పరుగుల వద్ద ఔటవగా ఇర్ఫాన్‌ఫఠాన్ 6రన్స్‌కే వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 79పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. వంద పరుగుల లోపే ఆలౌటవుతుందనుకున్నప్పటికి ఓపెనర్ గంభీర్, అశ్విన్ ఆదుకున్నారు. ప్రారంభం నుండి సహనంతో బ్యాటింగ్ చేస్తూ వచ్చిన గంభీర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా అశ్విన్ ధాటిగా ఆడాడు. దీంతో స్కోర్ బోర్డు 100పరుగులు దాటింది. అయితే అనవసరంగా మూడో పరుగు కోసం యత్నించిన అశ్విన్ రనౌటవడంతో వీరి పార్టనర్‌షిప్‌కు బ్రేక్ పడింది. తర్వాత టెయిలెండర్లు ఔటయ్యేందుకు ఎంతో పెరీరా 3, మాథ్యూస్ 3 వికెట్లు పడగొట్టారు. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన వీరిద్దరూ భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. చివరకి భారత జట్టు 33.3ఓవర్లలో 138పరుగులకు ఆలౌటైంది.