రెవెన్యూ సదస్సులకు సన్నద్ధంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
ధరణిలో నూతన ఐచికాలపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలిధరణిలో నూతన ఐచికాలపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలి
జాతీయ రహదారుల భూ సర్వే 7 రోజులలో పూర్తి చేయాలి
భూ సేకరణ, ధరణి తదితర అంశాలపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ & సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.
జగిత్యాల జూలై 6:- జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణ మరియు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి తదితర అంశాల పై కలెక్టర్ బుధవారం సంబంధించిన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ మరియు సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. జగిత్యాల జూలై 6:- జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణ మరియు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి తదితర అంశాల పై కలెక్టర్ బుధవారం సంబంధించిన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ మరియు సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.
ధరణి వెబ్ సైట్ లో ప్రభుత్వం కల్పించిన నూతన ఐచ్చికాలకు సంబంధించిన దరఖాస్తులను 2 , 3 రోజులలో పరిష్కరించి నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
మిగిలి ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండల కేంద్రంగా 3 రోజులపాటు సదస్సు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రతి మండలంలో ఇప్పటివరకు అందిన దరఖాస్తుల మేర ఉన్న భూ సమస్యలపై తహసీల్దారులు సంపూర్ణ నివేదిక తయారు చేసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
జగిత్యాల రూరల్ ,జగిత్యాల అర్బన్, మల్యాల, కొడిమ్యాల మండలాలో జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూ సర్వే ప్రక్రియ 50% ముగిసిందని, పెండింగ్ భూ సర్వే ప్రక్రియను 7 రోజుల్లో పూర్తయ్యే విధంగా వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, జిల్లాలోని తాసిల్దార్లు, జాతీయ రహదారి కోఆర్డినేటర్, సంబంధిత అధికారులు తదితరులు ఈ టెలి కాన్ఫరెన్స్ మరియు సమావేశం లో పాల్గొన్నారు.జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, జిల్లాలోని తాసిల్దార్లు, జాతీయ రహదారి కోఆర్డినేటర్, సంబంధిత అధికారులు తదితరులు ఈ టెలి కాన్ఫరెన్స్ మరియు సమావేశం లో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.