రేపటి నుంచి తెలంగాణ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు
హైదరాబాద్ : తొలి తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. రెండురోజులపాటు జరగనున్న ఈ లిఫ్టింగ్ పోటీలను నగరంలోని తార్నాక వంజరి సంఘం భవనంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం (టీడబ్లూఏ) తెలిపింది. ఈ టోర్నీలో పోటీపడదలచుకున్న లిఫ్టర్లు వివరాలకు తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెల్ నంబరు: 9989934941 ప్రతినిధులను సంప్రదించగలరు.