రేపటి నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘స్లాట్‌ బుకింగ్‌’

` తొలుత ప్రయోగాత్మకంగా 22 ఆఫీసుల్లో పరిశీలన
` ఈ విధానం ద్వారా కేవలం 10 – 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి
` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘స్లాట్‌ బుకింగ్‌’ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 10 నుంచి రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు.తొలుత ప్రయోగాత్మకంగా 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ అమలు చేయనున్నట్లు తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌తో 10 – 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుందన్నారు.

 

తాజావార్తలు