రేపు డీఈవో కార్యాలయం ముందు ధర్నా
మట్టెవాడ, న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖలోని అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా డెమోక్రటిక్ టీచర్స్ అసోసియేషన్
(డీటీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండలోని డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు
డీటీఎఫ్ తూర్పశాఖ అధ్యక్ష కార్యదర్శులు కె.నర్సింహులు, పివి.నర్సింహరెడ్డిలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులందరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.