రేషన్‌ దుకాణాల వ్యవస్థ రద్దు తగదు

డీలర్ల సమస్యలను పరిష్కరించాల్సిందే
-వైఎస్సార్సీపి డిమాండ్‌
కరీంనగర్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటుండడమేకాక దేశంలోనే అత్యద్బుత పాలనను అందిస్తూ నంబర్‌వన్‌గా నిలుస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రభుత్వం రేషన్‌ దుకాఖాణాలనుంచి బియ్యం రీసైక్లింగ్‌/-కు తరలుతున్నా  ఎందుకు అరికట్టలేక పోతున్నారని వైఎస్సార్సీపి తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చు కునేందుకు ఈ వ్యవస్థను తొలగించాలని చూడడం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శన మని వైఎస్సార్సీపి తీవ్రస్థాయిలో మండిపడింది.సోమవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో వైఎస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కె నగేశ్‌, నగర అధ్యక్షుడు రాజన్న, మహిళా అద్యక్షురాలు పద్మ, రాష్ట్రనాయకులు కుమార్‌, సిరిరవి, సుదాకర్‌ రావ్‌, ఎస్‌కె జావిద్‌, అంజయ్య, అక్షయ్‌ ఫిరోజ్‌, శ్రీనివాస్‌, శేఖర్‌, ముఖేష్‌లతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్‌ ప్రారంభించిన రూపాయికి కిలో బియ్యాన్ని ప్రారంభించి ఆహార భద్రతా పథకాన్ని ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు తొలగించినప్పటికి వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చిన తర్వా త రెండురూపాయల బియ్యంపథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. దీనిని గొప్పగా చెప్పుకునేందుకు నేటీ సీఎం కేసీఆర్‌ గతంలో ఇస్తున్న నాలుగు కిలోల బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచామని చెప్పుకుని నేడు ఆపథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని దీనిని వైసీపి పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. జిల్లానుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తే నేడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడని ఈటెల ఈవిషయంలో ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. పౌరసరఫరాల శాఖను ప్రతిష్టాత్మకంగా ఓ ఐపీఎస్‌ అదికారిని నియమించి ఈపాస్‌ విదానంఅమలు చేస్తున్నప్పటికి కూడా అక్రమాలకు పుల్‌ స్టాఫ్‌ పెట్టక పోవడంను ఏమనుకుంటారన్నారు.  పేదలందరికి మెరుగైన నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడమేకాక ఇంకా ఆరునుంచి 8 కిలో లకు పెంచి ఇవ్వాలని, అలాగే గతంలో ఇచ్చిన నిత్యావసరాలన్ని కూడా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇందులో ఒక్క తెలంగాణా ప్రభుత్వ దనమే ఉందనుకుంటే పొరపాటని, కేంద్రం వాటా కూడా ఉందని గుర్తు చేశారు. పేదరికం పోయేవరకు కూడా రేషన్‌ దుకాణాల వ్యవస్థను కొనసాగించాల్సిందేనని డాక్టర్‌ నగేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ అలోచనను విరమించుకోక పోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేయక తప్పదని ఆయన హెచ్చరించారు.