రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న పాత్రికేయులపై స్మగ్లర్లు దాడి…?

కామారెడ్డి జిల్లాలో షరా మామూలుగా అక్రమ రేషన్ బియ్యం రవాణా..
– మామూలకు అలవాటు పడిన అధికారులు..
– సమాచారం గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉండగా సమాచారం ఇచ్చిన వారి పేర్లు బయటకు పంపిస్తున్నారు…
– సంబంధిత శాఖలొ లీక్ వీరులు ఉన్నారు
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 15 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లాలో రేషన్ బియ్యం యదేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై పలు అనుమానాలు నెలకొన్నాయి. నిజాయితీ అధికారులు కేసులు చేసిన వారిపై రాజకీయ ఒత్తిడితో అక్రమ రవాణా యదేచ్ఛగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నదనెది సత్యం.
నిజాలను నిర్భయంగా రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురావలసిన కొంతమంది విలేకరుల ముసుగులో అవినీతికి , అక్రమాలకు పాల్పడుతూ జర్నలిజం వ్యవస్థను భ్రస్టుపరుస్తున్నారు. ఒక పత్రికకు రిపోర్టర్ గా పని చేయాలంటే విద్య అర్హత పరిగణంలోకి తీసుకొని రిపోర్టర్‌గా తీసుకోవాల్సి ఉండగా, కొంతమంది ఇలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్ట రాజ్యాంగ ఐడి కార్డులు అందజేస్తూన్నారు.ఒకప్పుడు జర్నలిజం అంటే సమాజంలో మంచి గుర్తింపు ఉండేది,
ప్రస్తుతం కొంతమంది వల్ల జర్నలిజంకి మచ్చ తీసుకొచ్చి పెడుతున్నారు. గత రెండు నెలల క్రితం కామారెడ్డిలో ఒక బియ్యం వ్యాపారి వద్ద డబ్బులు లంచం అడుగుతుండగా ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదుచెశారు. కామారెడ్డి పోలీసులు కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కొన్ని పత్రికల్లో పని చేస్తున్న రిపోర్టర్లలో మార్పు కనిపించడం లేదు. ఉదయం లేవగానే తాను ఫలానా పత్రిక అంటూ అధికారులను, వ్యాపారస్తులను వేధింపులకు గురిచేస్తూ దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది విలేకరులు రేషన్ బియ్యం స్మగ్లర్ల వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేయగా. వారు విలేకరులపై దాడికి పాల్పడినట్టు సమాచారం. ప్రతినెల కొంతమంది విలేకరులు తాము జిల్లాకు బాసులమంటూ చెప్పుకుంటూ అవినీతి అక్రమాలకు చోటు కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా గాంధారిలో గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న వారితో చేతులు కలిపి ,నెల నెల కొంతమంది విలేకరులమని చెప్పుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. రేషన్ బియ్యం స్మగ్లర్ల ముఠా రెండు రోజులు క్రితం గాంధారి శివారులో విలేకరులపై దాడి చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
– ఈ విషయమై గాంధారి ఎస్సై సాయి రెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
రామారెడ్డిలొ డిసియం,దోమకొండ రైస్ మల్ యాజమాని పై దొమాకొండ యస్ఐ సుదాకర్ కెస్ నమొద్ చెశారు. అయిన కామారెడ్డి జిల్లా లొ పెదల బియ్యం పెద్దలపాలు అవుతయన్నాయి. అక్రమ రవాణాలో రైస్ మిల్లర్లకు సంబంధించిన ఒక నాయకుడి హస్తం ఉందని అయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిడితో సివిల్ సప్లై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? పాత్రికేయులు టాస్క్ ఫోర్స్, ఎన్ ఫోర్స్ మెంట్, సిసిఎస్ సంబంధిత శాఖ అధికారులకు పాత్రికేయులు సమాచారం ఇవ్వగా అక్కడ అక్కడ అక్రమాలు బయట పడుతున్నాయి, ఇలాంటి అక్రమ వ్యాపారం కామారెడ్డి జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. అక్రమాలు జరుగుతున్నాయని జిల్లా స్థాయి అధికారులకు తెలిసినప్పటికీ మామూళ్ల మత్తులో జోగుతూ తప్పించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రముఖ నాయకుడు పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులకు పాత్రికేయులు సమాచారం ఇవ్వగా అధికారులు సమాచారాన్ని దాచి ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉండగా స్మగ్లర్లకు చేరవేయడంతో పాత్రికేయులపై దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిరుపేదల కోసం ఒక రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేస్తుంది, దళారులు స్మగ్లర్లు, పేదల అవసరాలు ఆసరా చేసుకుని, వాటిని రీసైక్లింగ్ చేసి ఐదు వేల రూపాయల పైగా క్వింటాలుకు ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఒక రైస్ మిల్ యజమాని చక్రం తిప్పినట్లు తెలిసిన ఆయన రాజకీయ చతురతతో పాత్రికేయులను నిజాలను రాయకుండా చీకటి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. పైగా పాత్రికేయుల పై కేసు నమోదు చేసి వారి ఆత్మాభిమానం దెబ్బతినేలా చూస్తున్నారు.