రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలి. సీపీఐ

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 23(జనం సాక్షి)
ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే అందుకు ప్రవేశ పెట్టిన రేషన్ బియ్యం పతకం పూర్తిగా అక్రమ లు జరుగుతున్నాయని సివిల్ సప్లయ్, పోలీస్ అధికారులు ఏమాత్రం పట్టించు కోవడం లేదనిదీనిని నిరసిస్తూ సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ప్లే కార్డు లు పట్టుకొని ఆదివారంబద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిరసన తెల్పడం జరిగింది
ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసి రెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చల విడిగా నడుస్తున్న పట్టించుకునే నాథుడే లేడు అని ఉదయం లేవగానే బియ్యం కొంటం అని ఇండ్ల చుట్టూ తిరుగుతూ ఎదేచగ కొనుగోలు చేస్తున్న పట్టించుకునే వారు లేరని ఆరోపించారు. కొందరు రైస్ మిల్లర్లు ఇదందా కొన సాగిస్తున్నారని గతంలో కేసులు నమోదు చేశారని మళ్లీ వాళ్ళే దందా కొన సాగిస్తున్నారని రాష్ట్ర సరిహద్దుల్లో ఒక రైస్ మిల్లు ఏర్పాటు చేసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మి ప్రజా ధనాన్ని కొల్ల గొడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తంచేశారు గతంలో కొందరి పై 6A కింద కేసులు నమోదు అయిన వారికి CMR బియ్యం సప్లయ్ చేస్తున్నారని కొందరు రీసైక్లింగ్ చేసి కోళ్ల పార లకు ఇతర రాష్ట్రాల కు తరలిస్తున్న 6 ఏ కింద కేసులు నమోదు అయిన వారికి మళ్లీ ధాన్యాన్ని కేటాయిస్తున్నారని ఇది దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.రేషన్ షాపుల్లో తూకం లో కూడా 50 కేజీల కు బదులు 46,48 కిలోలే వస్తున్నాయని తునికల అధికారులు మొద్దు నిద్రలో వున్నారని పేర్కొన్నారు
పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించే జిల్లా లోనే ఈ అక్రమ దందా సాగడం సిగ్గు చేటన్నారు జిల్లా సరిహద్దు లో చెక్ పోస్ట్ లలో సరైన నిఘా, పర్యవేక్షణ లేకపోవడం వల్లే అక్రమ రవాణా సాగుతుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అక్రమ రవాణా దారుల పై కేసులు నమోదు చేయాలని, సూత్ర దారుల పై పీడీ యాక్టు నమోదు చేయాలని, సివిల్ సప్లై, పోలీస్ అధికారులు ఉమ్మడి గా అక్రమ నిల్వల పై దాడులు చేయాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడి పల్లి రాజు, సీపీఐ నగర కార్య వర్గ సభ్యులు కూన రవీందర్, బొనగిరి మహేందర్, నంది కొండ అంజి రెడ్డి, ఎడ్ల తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, రమేష్ తది తరులు పాల్గొన్నారు