రైతుబంధును విస్తరించే అవకాశాలు పరిశీలిస్తాం
ప్రచారంలో మంత్రిపోచారం వెల్లడి
నిజామాబాద్,నవంబర్6(జనంసాక్షి): రైతుబంధు సాయాన్ని ప్రతి రైతుకు వర్తింపజేస్తామని వ్యవసాయశౄఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వానకాలం పంట సాయాన్ని నేరుగా రైతులకు చెక్కుల రూపంలోనే అందించామని, యాసంగి సాయాన్ని ఈసీ నిబంధనల కారణంగా రైతుల బ్యాంకుఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. పాస్ పుస్తకాలు అందని రైతులకు తహసీల్దార్ ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగా డిసెంబర్ 12 తర్వాత రెండు పంటల పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్నారు. కూటమి మాటలను ప్రజలు నమ్మేస్థితిలోలేరని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు. 2014కు ముందు కరంట్ కోతలు ఉండేవన్న విసయాన్ని మరచిపోరాదన్నారు. కెసిఆర్ సిఎం అయ్యాక ఇవాళ నిరంతరంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పవర్ హాలిడేలు ఎత్తేయండి, విద్యుత్ సరఫరాచేసి మమ్మల్ని కాపాడాలంటూ హైదరాబాద్‌లో గతంలో ఇందిరాపార్కు వద్ద రాష్ట్రంలోని పరిశ్రమల యాజమానులం ధర్నాలు చేసేవారిన గుర్తు చేశారు. అలాంటి చీకటి రోజులు మళ్లీ రావద్దంటే మన జీవితాల్లో, పరిశ్రమల్లో వెలుగులు నింపిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్షని అన్నారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో ముందే చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత 24గంటల విద్యుత్‌ను తప్పకుండా అమలుచేసి ఆరు నెలల్లోనే మన కష్టాలన్నీ తీర్చారని అన్నారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే చీకట్లు అలుముకుంటాయని, విద్యుత్ అసలే రాదని చెప్పిననాటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు నేడు ఏకమై మరోసారి కుట్రలు చేయబోతున్నాయని హెచ్చరించారు. వాటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు ఏకమై వస్తున్నాయని, ఖర్మకాలి వాళ్లు అధికారంలోకి వస్తే మళ్లీ వస్తే జరుగబోయే
ప్రమాదం ఏంటో ప్రజలకు వివరించాల్సిన అవసరం, బాధ్యత మనపై ఉందన్నారు. నేడు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పారిశ్రమిక రంగం అభివృద్ధి చెందుతూ 55 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు.