రైతుబంధు ఎంతో ఉపయోగకరం

ఖమ్మం,మే30(జ‌నంసాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని సీఎం కేసీఆర్‌ పెట్టి రైతుకు పెట్టుబడి సాయం అందించడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతు బంధు పథకమే కాకుండా తెంగాణలోని ప్రతీ పథకం ప్రజకు ఎంతో ఉపయోగపడేలా ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి పథకాు పెట్టి రాజకీయాకు అతీతంగా వాటిని అము చేయండం అభినందనీయమని అన్నారు. తెంగాణ రాష్ట్రంలోని రైతుకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని ఆంధ్రా ప్రాంతానికి చెందిన రైతుకూ అందిస్తూ సాగుకు పెట్టుబడి అందించే పెద్దన్న సీఎం కేసీఆర్‌ అని అన్నారు. నియంత్‌ఇరత సాగులో పంటను వేసి, తెంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంలో భాగంగా అందజేస్తున్న పెట్టుపడి సాయాన్ని రైతు సాగు కోసమే వినియోగించి, అధిక దిగుబడు సాధించి సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని నెరవేర్చాని ఆయన సూచించారు. రైతుకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించేందుకే రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. రైతుకు వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.5వే చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుందన్నారు. పెట్టుబడి సాయాన్ని రైతు ఇతర ప్రయోజనాకు వాడుకోకుండా వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాని సూచించారు. అదేవిధంగా ఇకపై రైతు రుణా కోసం బ్యాంకుల్లో పాస్‌ పుస్తకాను తనఖా పెట్టాల్సిన పనిలేదన్నారు.